జిస్మ్-2లో బూతు ఉండదు!
Published on July 14, 2012 · 2 Comments

ఇండో కెనడియన్ పోర్నోస్టార్ సన్నీ లియోన్ ను పెట్టి సినిమా తీస్తున్నారంటే….ఆ సినిమా నుంచి జనాలు ఏం ఎక్సెపెక్ట్ చేస్తారో, అందులో ఏం ప్రత్యేకతలు ఉంటాయని అనుకొంటారో….అవే లేవు అంటున్నారు ఆ సినిమా రూపకర్త పూజాభట్! తమ సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు, అసహ్యకరమైన సంభాషణలు ఉండవని తేల్చేస్తోంది ఈ మాజీ హీరోయిన్. ఈ మాటల్లో ఎంత నిజముందో అనేది అంచనా వేయలేం కానీ, జిస్మ్ -2 కు సంబంధించి తొలి పోస్టరే ఈ సినిమా స్థాయిని స్పష్టపరిచింది. అలాంటిది ఇప్పుడు పూజాభట్ వచ్చి ఇది క్లీన్ యూ సినిమా, కుటుంబ కథా చిత్రం అంటే నమ్మడం కొంచెం కష్టమే! హీరోహీరోయిన్ల మధ్య ప్లజంట్ కెమెస్ట్రీ ఉంటుందని, దీన్ని బూతుగా చూపలేదని పూజ తన ట్విటర్ అకౌంట్ లో పేర్కొంది. ఇన్ని రోజులూ తమ ఫ్యామిలీ తీసిన కొన్ని సినిమాల్లో సంభాషణ ల విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని జిస్మ్ రెండో భాగం విషయంలో జాగ్రత్త వహించామని పూజ పేర్కొంది. అంతే కాదు ఇటీవల విడుదల అయి ఆడ,మగ మధ్య సంభాషణల విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కొన్ని సినిమాలను కూడా పూజ ప్రస్తావిస్తోంది. మరి జిస్మ్-2 లో అసభ్యకరమైన సంభాషణలు మాత్రమే ఉండవని పూజాభట్ స్పష్టపరుస్తోందా లేక ఇందులో హాట్ సీన్స్ కూడా లేకుండా చేసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తోందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!