మళ్లీ సెక్సీయెస్ట్ భామ ఆమే
Published on July 5, 2012 · 7 Comments.jpg)
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని రుజువయ్యింది. ఈ బక్కపలచని భామ వరసగా నాలుగోసారి వరల్డ్ సెక్సీఎస్ట్ విమెన్ గా ఎంపిక కావడం ఆమెకు తిరుగులేదని చాటుతోంది. సుప్రసిద్ధ హాలీవుడ్ నటీమణులు…మేగాన్ ఫాక్స్, ఎంజెలీనా జోలీ, బ్లేక్ తదితరులతో పాటు అనేక మంది బాలీవుడ్ నటీమణులతో పోటీపడి ఈ ప్రపంచ సెక్సీఎస్ట్ మహిళ కిరీటాన్ని కత్రినాకైఫ్ దక్కించుకొంది. ఎఫ్ హెచ్ ఎమ్ మేగ్జిన్ ఆన్ లైన్ ద్వారా, ఎస్ ఎమ్ ఎస్ పోల్ ద్వారా జరిపిన సర్వేలో కత్రినా జనుల మద్దతును దక్కించుకొంది. దీనిపై ఆమె మాట్లాడుతూ…’నాకు నిజంగా చాలా ఎగ్జైట్ కలిగించిన వార్త ఇది. కేవలం ఫిజికల్ లుక్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొని జనాలు నాకు ఓటు వేసుంటారు అని నేను అనుకోవడం లేదు. నా పూర్తి ప్రవర్తనను మదిలోపెట్టుకొని వారు సెక్సీఎస్ట్్గా గుర్తించి ఉంటారు…’ అని కత్రినా అంటోంది. ఇంతకీ సెక్సీ అంటే ఏంటి అని ఈ 27 ఏళ్ల ఇండో- బ్రిటన్ సుందరిని అడిగితే….’సెక్సీగా ఉండటం అంటే అది దుస్తులకు సంబంధించినది కాదు. కాటన్ శారీ కట్టుకొన్నా, మేకప్ లేకున్నా ఉండే సహజమైన అందమే సెక్సీ’ అంటూ నిర్వచనాన్ని ఇచ్చింది కత్రినా. ఇక ఇంటర్నెట్ లో కూడా సర్చింగ్ అవుతున్న పేరుగా కత్రినా కైఫ్ నిలిచి తనకున్న క్రేజ్ ఏపాటిదో వివరిస్తోంది.



No comments:
Post a Comment