ప్రణబ్ ప్రమాణ స్వీకారం
Published on July 25, 2012 · 2 Comments
అంతకు ముందు ప్రమాణ స్వీకారానికి వస్తున్న ప్రణబ్‌కు ఘన స్వాగతం లభించింది. త్రివిధ దళాలు ఆయనను పార్లమెంట్ సెంట్రల్ హాల్ వరకు తీసుకుని వచ్చారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రణబ్ తుపాకులతో సైనిక వందనం స్వీకరించారు.
అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేం
దుకు కృషి చేస్తానని అన్నారు. తనకు దక్కిన అత్యున్నత పదవికి సదా కృతజ్ఞుడినని తెలిపారు. రాష్ట్రపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పారు. దేశం ముందున్న సమస్యలను ఎదుర్కొంటానని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని చెప్పారు. దేశ ప్రగతికి ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు.
ప్రమాణ స్వీకారానికి ముందు ప్రణబ్ ఈ రోజు ఉదయం మహాత్మగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మునికి అంజలి ఘటించారు. అనంతరం ప్రణబ్ వీర్ భూమిని సందర్శించి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి శ్రద్ధాంజలి సమర్పించారు.
No comments:
Post a Comment