Thursday, 26 July 2012

కరీనా కపూర్ ‘హీరోయిన్’ పెద్దలకు మాత్రమే!


కరీనా కపూర్ ‘హీరోయిన్’ పెద్దలకు మాత్రమే!

Published on July 15, 2012   ·   1 Comment
Share
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న క్రేజీ సినిమా ‘హీరోయిన్’ సెన్సార్ పూర్తి చేసుకొంది. రియాలిస్టిక్ సినిమాలు కొంచెం అతిని మిక్స్ చేసి తీస్తాడని పేరున్న భండార్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది కేవలం  పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమాగా  సెన్సార్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని మధుర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ‘నేను ముందుగానే ఎక్స్ పెక్ట్ చేశాను. నా సినిమాకు సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ప్రోమో, పోస్టర్ల విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభిస్తాము…’ అని మధుర్ పేర్కొన్నాడు. ఇంతకు ముందు పేజ్ -3 ద్వారా సెలబ్రిటీ ల జీవితాల్లో చీకటి కోణాలను, ట్రాఫిక్ సిగ్నల్ , కార్పొరేట్ వంటి సినిమా ల ద్వారా సమాజంలో భిన్న వర్గాల జీవన శైలిని ప్రత్యేకించి వాస్తవంలో వాటి తీరును మధుర్ బాగా చిత్రీకరించాడని పేరు వచ్చింది. తాజాగా మరోసారి సినిమా జీవితాలను గురించి వివరిస్తానంటూ ‘హీరోయిన్’ సినిమా రూపొందించాడు మధుర్, మొన్న మధ్య ఫ్యాషన్ సినిమా మోడళ్ల జీవితాల గురించి పరిచయంచేసింది. ఆ సినిమాతో ప్రియాంక చోప్రా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇక తాజా ‘హీరోయిన్’ సినిమా విషయంలో మొదట హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ను అనుకొన్నా…ఆమె ప్రెగ్నెన్సీ తో  కరీనా ‘హీరోయిన్’ అయ్యింది. అర్జున్ రామ్ పాల్ ఇందులో మేల్ లీడ్ రోల్ చేస్తున్నాడు.

No comments:

Post a Comment