Thursday, 26 July 2012

నిత్యానంద పురుషత్వానికి టెస్ట్!


నిత్యానంద పురుషత్వానికి టెస్ట్!

Published on July 19, 2012   ·   7 Comments
Share
రంజితతో సరసల్లాపాలు సాగించింది తాను కాదని, అసలు తనకు ‘ఆ’ సామర్థ్యమే లేదని కోర్టకు చెప్పించి తప్పించుకో జూసిన స్వామి నిత్యానందకు అనుకోని షాక్ ఇచ్చింది కోర్టు. వివాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందకు ఈనెల 30 ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని బెంగుళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆశ్రమ వర్గాలు కంగుతిన్నాయి. నటి రంజితతో నిత్యానంద రాసలీల ల సీడీలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో నిత్యానంద తన స్వభావం చిన్న పిల్లాడితో సమానమని తాను రాసలీల్లో ఎలా పాల్గొంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసలీలల కేసులో నిత్యానందకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఐడీ అధికారులు అప్పట్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పలుమార్లు నిత్యానందకు నోటీసులు అందించినా ఆయన పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 30న నిత్యానందకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నిత్యానంద వ్యవహరశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అధ్యాయం పై నిత్యానంద ఎలాంటి డైవర్షన్ తీసుకొంటాడో!

No comments:

Post a Comment