Thursday, 26 July 2012

ఆ సినిమా బాలకృష్ణదా? మనోజ్ దా?


ఆ సినిమా బాలకృష్ణదా? మనోజ్ దా?

Published on July 25, 2012   ·   2 Comments
Share
తాజా ట్రైలరుతో మరో అరుంధతి అవుతుందా అని “ఊ కొడతారా, ఉలిక్కిపడతారా” సినిమా గురించి టాక్ వస్తోంది. మొదట్నుంచే విచిత్రమైన టైటిల్ తో జనం దృష్టిలో పడిన ఈ సినిమాను మంచు ఫ్యామిలీ బాలకృష్ణను అడ్డంపెట్టుకుని జనాల్లోకి తీసుకుపోయింది. మనోజ్ ఈ కలల ప్రాజెక్టును సొంత బ్యానరుపై భారీ ఖర్చు పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించారు. నేడు సినిమాలు హిట్లు, ఫట్లు కాదు.. లాభాలా? నస్టాలా అన్న సిద్ధాంతంపై నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో  సినిమాకు లాభాలు రావాలంటే మంచి ఓపెనింగ్స్ ఉండాలంటే… దానికేం చేయాలి అని ఆలోచిస్తే వచ్చిన ఐడియానే బాలకృష్ణ. నిజానికి వేరే హీరోతో కూడా  కలిసి సినిమా చేయవచ్చు. కానీ, ఓపెనింగ్స్ తేగల ఇతర హీరోలు తనతో నటించడానికి ముందుకు వచ్చేదెవరు? అన్నది కూడా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి… బాలకృష్ణ వారి కళ్లకు కనబడ్డాడు. నాలుగు మాటలు చెప్పి అయ్యా అంటే బాలయ్య ఈజీగా బుట్టలో పడతాడు. అలా బాలకృష్ణ మంచు ఫ్యామిలీ వేసిన కంచు ఐడియాలో ఓ పావు అయ్యాడు. ఇక బాలయ్యను అడ్డంపెట్టుకుని ఇటు ఏపీలోనూ అటు ఓవర్సీస్ లోనూ ఓపెనింగ్స్ రాబట్టుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, సీడెడ్లలో బాలయ్యకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇంత భారీ ప్రాజెక్టులో మొత్తం మునిగిపోకుండా ఉండాలంటే సినిమాకు బాలయ్య అవసరం ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర గురించి ఆరా తీస్తే తేలిందేంటంటే ఇది మరో ఈగ అనుకోండి. నాని మొదటి ఇరవై నిమిషాలే కనిపించినా సినిమా అంతా ఈగ రూపంలో నాని పాత్రే. ఇందులో కూడా బాలకృష్ణ పాత్ర అలాంటిదే. బాలయ్యతో కాస్త కథ నడిపాక ఆ పాత్ర చనిపోతుంది (?) చివరికి ఆ ఆత్మ మనోజ్ లోకి ప్రవేశిస్తుంది. కథంతా ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంది. దీనివల్ల బాలకృష్ణ అభిమానులను సంతృప్తి పరచడంతో పాటు నందమూరి టికెట్ బ్యాంకును కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చని వేసిన మహాపన్నాగం ఇది. ఏదైతే ఏంటి… ఒక మంచి సినిమా వస్తే మంచిది, రావాలని ఆశిద్దాం. పైగా భిన్నమైన కథలను ఎంచుకుని, నటనకు ప్రాధాన్యం ఇచ్చే మనోజ్ కు ఈ సినిమా ద్వారా అయినా కళామాత ఆశీస్సులు దక్కాలని కోరుకుందాం.
0digg

No comments:

Post a Comment