‘ప్రాణభయం’ ఉందంటున్న తారాచౌదరి!
Published on July 13, 2012 · 3 Comments
తనను తమకు తోచినట్టు వాడుకొన్న రాజకీయ, సామాజిక ప్రముఖులపై తారాచౌదరి బహిరంగంగా యుద్ధం ప్రారంభించింది. నిన్నా మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పుణ్యమా అంటూ తన వాదనను టీవీ ద్వారా వినిపించే అవకాశం పొందిన తార తాజాగా అనేక మంది రాజకీయ పోలీసు ప్రముఖలపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తారా చౌదరి తనకు ప్రాణహాని ఉందంటూ కొంత మంది ప్రముఖుల పేర్లను తన ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే వేణుగోపాల చారి, మాజీ డైరెక్టర్ జనరల్ భాస్కర్ లతో పాటు కొందరు పోలీసు ఉన్నతాధికారుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తార పేర్కొంది. రాయపాటితో సహా ఇంకా అనేక మంది తనతో ఫోన్ మాట్లాడిన రికార్డులను కూడా తార పోలీసు ఉన్నతాధికారులకు అందజేసినట్టు సమాచారం.మరి తార ఫిర్యాదుపై పోలీసు శాఖ ఎలా స్పందస్తుందో చూడాలి!
No comments:
Post a Comment